మంచిర్యాల
చెన్నూరు: ఆర్టీసీ రీక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు
చెన్నూరు పట్టణంలోని గోదావరి రోడ్ చౌరస్తాలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం కౌన్సిలర్ రెవెల్లి మహేష్ మాట్లాడుతూ బస్ స్టాప్ ఏర్పాటుతో మహంకాళి వాడ, బొక్కలగూడెం, కుమ్మరి బోగూడ, బెస్తవాడ, ఖాజీపుర, తదితర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాయిని సతీష్, బజ్జోరి కమల, తిరుపతి, సురేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.