నేడు, రేపు సింహపురి ఎక్స్ప్రెస్ రద్దు
శని, ఆదివారాల్లో సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శనివారం నాడు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే (12710) రైలును రద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రాబాద్కు వచ్చే (12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. సింహపురి ఎక్స్ప్రెస్ రైలు రద్దు నేపథ్యంలో ఆయా రోజుల్లో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు పూర్తి సొమ్ము వాపసు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.