'నీ భర్తపై కేసు నమోదు చేయాలంటే నా కోరిక తీర్చాలి'... SI వేధింపులు
తన భర్తపై ఫిర్యాదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళను ఎస్ఐ వేధింపులకు గురి చేసిన ఘటన HYDలో జరిగింది. సదరు మహిళ భర్త వేధింపులతో ఫిర్యాదు చేయడానికి హయత్నగర్ PSకు వెళ్ళింది. ఫిర్యాదులో భాగంగా ఇచ్చిన మహిళ ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ SI సైదులు వేధింపులకు గురిచేశాడు. 'నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా' అంటూ SI ఫోన్లు చేసేవాడు. దీంతో సైదులుపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు మహిళ ఫిర్యాదు చేశారు.