తుంగతుర్తి నియోజకవర్గం
శాలిగౌరారం: రైతు సమ్మేళన వేదికను ఢీకొని యువకుడు మృతి
శారీగౌరారం మండలం గురజాల-మానయి కుంట మధ్యన మూసి నదిపై ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించ తలపెట్టారు. ఈ సభ కోసం వేసిన వేదికని ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జంగాలగూడెంకి చెందిన తూర్పాటి చరణ్ (16) శనివారం రాత్రి తన కుటుంబ సభ్యులకు టాబ్లెట్లు తేవడానికి బైక్ పై మూసినది మీదుగా మానయికుంట వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.