జగన్ ఫ్లెక్సీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఏపీలోని ఓ జిల్లాలో ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫొటోలు ఉన్న బ్యానర్లు వైరల్ అవుతున్నాయి. విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలంలోని పినతాడివాడలో అల్లు అర్జున్ అభిమానులు వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీ బంగారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా జగన్, అల్లు అర్జున్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు గ్రామంలో వెలిశాయి. “YCP-AA MUTUAL" బ్యానర్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో యువత ఫొటోలను షేర్ చేస్తున్నారు.