భారీ వర్షాలు.. కళ్ల ముందే కుప్పకూలిన బిల్డింగ్ (వీడియో)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక చంపావత్లోని భిగ్రదా ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు పక్కనే కొండవాలులో నిర్మించిన భవనం ఒక్క క్షణంలో కుప్పకూలింది. స్థానికులు చూస్తుండగానే వారి కళ్ల ముందే కూలి లోయలో పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.