VIDEO: ఢిల్లీలో పొల్యూషన్.. కృత్రిమ వర్షం కురిపించారు
ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే సమీప రాష్ట్రం హరియాణాలోని గురుగ్రామ్ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి DLF ప్రైమస్ సొసైటీ నివాసితులు ఎత్తైన భవనం నుంచి స్ప్రింక్లర్ల ద్వారా కృత్రిమ వర్షం కురిపించారు. 32 అంతస్తుల నుంచి వర్షం కురిపించడం వల్ల కనీసం దుమ్ము, ఇతర కణాలను కొంతవరకు నియంత్రించవచ్చని వారు అన్నారు. కాలుష్య నియంత్రణ కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదన్నారు.