బ్రిడ్జ్‌పై బైక్‌తో విన్యాసాలు.. వీడియో వైరల్
బ్రిడ్జ్ పై బైకులతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఆకతాయిలు. హైదరాబాద్- ఆర్టీసీ క్రాస్ రోడ్డు నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైకులతో ఆకతాయిలు విన్యాసాలు చేస్తున్నారు. రోజు రోజుకి ఆకతాయిల ఆగడాలు రెచ్చిపోతున్నాయని పలువురు మండిపడుతున్నారు. సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో ఆకతాయిలు స్టంట్లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై చిక్కడపల్లి పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.