గజ్వేల్
నేత్రదానం మహాదానం: దేవస్థానం మాజీ డైరెక్టర్
నేత్రదానం మహాదానమని నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు దొంతుల రాజేశం అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యుల సమ్మతితో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్యులు నేత్రాలను సేకరించారు.