ధర్మవరం: అమిత్ షా రాజీనామా చేయాలి: సీపీఐ నేత మధు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు సోమవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిపిఐ, సీఐటీయూ పార్టీ నాయకులు ధర్మవరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. అంబేడ్కర్ కు క్షమాపణ చెప్పాలన్నారు.