

పులివెందుల: ఇబ్బందులకు గురిచేస్తే న్యాయపోరాటం చేస్తాం
పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు కటిక రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్య కటిక రెడ్డి పద్మావతి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కటికరెడ్డి పద్మావతి మాట్లాడుతూ. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గతంలో ఎంక్వయిరీ చేశారని, ప్రస్తుతం మళ్ళీ విచారణ చేస్తున్నారన్నారు.