మక్తల్
పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ఉట్కూరు మండలం కొల్లూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, ఆవరణను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ గణితం సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో టీచర్ల కొరత ఉందని ఎమ్మెల్యేకు చెప్పారు. అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.