
ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సీఐ తెలిపిన ప్రకారం.. గంగాధర్ మంగళవారం ఎక్సైల్ పై వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.