
వేల్పూర్: డెడ్ బాడీ ఫ్రీజర్ వితరణ
వేల్పూర్ మండలంలోని జానకంపేట్ గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం డెడ్ బాడీ ఫ్రీజర్ ను మంగళవారం వితరణ చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ సోడా రమేష్ మాట్లాడుతూ జేమ్స్ గంగారెడ్డి తండ్రి స్వర్గీయ గాదేపల్లి మల్లేష్, మేనమామ స్వర్గీయ పోచంపల్లి రాజన్న జ్ఞాపకార్థం గ్రామానికి ఫ్రీజర్ ను వితరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.