బాన్సువాడ
బోర్లంలో మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గురువారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం మందకృష్ణ చిత్రపటానితో గ్రామంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా దండోరా డివిజన్ అధ్యక్షుడు దుర్కి బాలరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు.