ఖమ్మం
ఖమ్మం: క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఖమ్మం నగరం 26వ డివిజన్ బ్రాహ్మణ బజార్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. ఉసిరి చెట్టు దగ్గర ప్రమిదలలో దీపాలు వెలిగించి మహిళలు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ అష్టోత్తర శతనామపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొదుమూరు సుధారాణి, ఆకుల మంజుల తదితర మహిళామణులు పాల్గొన్నారు.