రతన్ టాటా దయగల అసాధారణ వేత్త: ప్రధాని మోదీ
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’’అని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు. .