నర్సాపూర్ నియోజకవర్గం
ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ: ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గురువారం ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పువ్వులను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.