కొత్త డీజీపీ పొంగులేటికి అభినందనలు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మంత్రి పొంగులేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన గత ప్రభుత్వంలోని కీలక నాయకులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పిన మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్వీట్లో "తెలంగాణకు కొత్త డీజీపీ వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పాత్ర స్వీకరించిన పొంగులేటికి అభినందనలు" అని తనదైన శైలిలో కేటీఆర్ సెటైర్ వేశారు.