హన్మకొండ: ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు
ఆర్టీసీ బస్ ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడతున్న భార్య భర్తలను హన్మకొండ పోలీసులు అరెస్టు చేసారు. సోమవారం ఈ మేరకు వారి నుండి సుమారు 8 లక్షల 50వేల రూపాయల విలువల గల 100 గ్రాముల 5మిల్లీ గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటారం గ్రామం. ప్రస్తుతం హన్మకొండ కుమార్ పల్లిలో నివాసం వుంటున్న చెల్ల స్వప్న (27), మద్దూరి సత్యనారయణ (38) లుగా గుర్తించారు.