Top 10 viral news 🔥
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష
తెలంగాణలో తొలి రోజు నిర్వహించిన గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. ఇక, ఈ నెల 27 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.