Top 10 viral news 🔥
కస్తూర్బా విద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు పరారీ
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండాపోయారు. ఆదివారం అర్ధరాత్రి వారు పరారు కావడం సంచలనం రేపింది. జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామానికి చెందిన విద్యార్థిని రెడ్డి బార్గవి, రాజాం వస్త్రపూరికాలనీకి చెందిన తలారి లిఖితలు గోడ దూకి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.