Top 10 viral news 🔥
EPFO ఖాతాదారులకు BIG ALERT.. UAN నంబర్ యాక్టివేట్ కోసం రేపే ఆఖరు
UAN ఖాతా ఉన్నవారికి కేంద్రం అలర్ట్ జారీచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారంతా తమ UAN నంబర్ యాక్టివ్ ఉండేలా చూసుకోవాలని EPFOకు ఆదేశాలు జారీచేసింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం ప్రయోజనాలను పొందే విధంగా UAN నెంబర్‌ను యాక్టివ్ చేసుకోవాలని సూచించింది. దీనికి శనివారంతో గడువు ముగియనుంది. కాగా, పీఎఫ్ ఖాతాదారులు తమ పాస్‌బుక్ డౌన్లోడ్, విత్‌డ్రాలు, అడ్వాన్సు దరఖాస్తులు, వ్యక్తిగత వివరాలను పొందేందుకు UAN యాక్టివేషన్ తప్పనిసరి.