లఢక్, మేఘాలయలో స్వల్ప భూకంపం
లఢక్, మేఘాలయలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. 3.5 తీవ్రతతో మేఘాలయలో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన లఢక్‌లోని కార్గిల్‌లో సైతం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.