ద్విచక్ర వాహనాలు జాగ్రత్త పరుచుకోండి
ఇటీవల కాలంలో సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో.. చెడు వ్యసనాలకు అలవాటు పడి చాలామంది యువత మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని మంగళవారం ఎర్రగుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ బాబు ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటార్ సైకిళ్ల యజమానులు వారి ద్విచక్ర వాహనాలను ఇంటి కాంపౌండ్ లోపల పెట్టుకోవాలన్నారు. అలా సదుపాయం లేని వారు ద్విచక్ర వాహనానికి వీల్ లాక్ అమర్చుకోవాలని సూచించారు.