లాగౌట్ కాకుండానే ఒకే ఫోన్ లో రెండు వాట్సప్ ఖాతాలను వినియోగించవచ్చు
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. లాగౌట్ కాకుండానే ఒకే ఫోన్లో 2 వాట్సాప్ ఖాతాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. సిమ్ లు మాత్రం ఖచ్చితంగా 2 ఉండాలని సూచించింది. దీని కోసం వాట్సాప్ ఓపెన్ చేసి కుడివైపు పై భాగంలో ఉండే 3 చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆపై మీ పేరు పక్కన కుడివైపున చివర్లో ఉండే ప్లస్ బటన్ నొక్కి యాడ్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అయితే రెండో ఖాతా వచ్చేస్తుంది.