
స్టూడియో ఘిబ్లీ కోసం ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టూడియో ఘిబ్లీ ఆర్ట్ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది చాట్ జీపీటీ లేదా గ్రోక్ వంటి AI టూల్స్ ద్వారా ఫొటోల్ని అప్లోడ్ చేసి ఘిబ్లీ స్టైల్లోకి మార్చుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'మనం ఇష్టపూర్వకంగానే ఫోటోలు అప్లోడ్ చేస్తాం కాబట్టి యాప్స్ ముఖ కవళికల్ని భద్రపరుచుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది' అని వివరిస్తున్నారు.