

ముథోల్
తానూర్: అగ్ని ప్రమాదంలో రేకుల షెడ్డు దగ్ధం
అగ్ని ప్రమాదంలో రేకుల షెడ్డు దగ్ధమైన ఘటన తానూర్ మండలం బోంద్రట్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. బోంద్రట్ గ్రామానికి చెందిన సొంకేడి సురేష్ పటేల్ రేకుల షెడ్డు సోమవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. షెడ్డులో ఉన్న వ్యవసాయ పరికరాలు, పశుగ్రాసం కాలిపోయిందన్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు రూ. లక్ష పైన నష్టం వాటిల్లినట్లు సమాచారం.