చెన్నూర్
శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో మరో ఏడుగురు అరెస్ట్
చెన్నూర్ లోని శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నడిపెల్లి లక్ష్మణ్ రావు, మందాల రాజబాపు, పెద్దింటి శ్రీనివాస్, లక్కం రాజబాపు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేశ్ గిల్దాను అరెస్ట్ చేయగా, బత్తుల సమ్మయ్య, రాంలాల్ గిల్దా, ఎన్నం బనయ్య. పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.