నారాయణ్ పేట్
రైతు పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన రైతు పండుగలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. చీరలను పరిశీలించి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.