కల్వకుర్తి
కల్వకుర్తి: సర్వేలో వ్యక్తిగత వివరాలు సేకరించవద్దు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గురువారం సీపీఐ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పులిజాల పరుశరాములు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేలో వ్యక్తిగత విషయాలను అడగవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తిగత వివరాలు అడుగుతూ ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్, ఆస్తులు, అప్పులు, ఆధార్ నెంబర్ వివరాలను సర్వే నుంచి తీసివేయాలని కోరారు.