ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (వీడియో)
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. చౌటుప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాజగోపాల్ రెడ్డి ఎక్కి మహిళలను పలకరించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ని అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ బస్సులోని మహిళలను అడిగారు.