రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. ఆరుగురు పౌరులు మృతి (వీడియో)
జమ్మూకశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ డాక్టర్ సహా ఆరుగురు కార్మికులు మృతిచెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. శ్రీనగర్ - లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కార్మికులు, సిబ్బంది పనులు ముగించుకొని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు.