భువనగిరి నియోజకవర్గం
పోచంపల్లి: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చెట్ల తొలగింపు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సోమవారం యాదాద్రి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీలోని 13వ వర్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, రోడ్లు క్లీనింగ్, రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. డ్రైనేజీలలో ఉన్నటువంటి చెత్తను తీసివేయడం తదితర ప్రదేశాలను శుభ్రం చేయడం, పబ్లిక్ టాయిలెట్లను క్లీనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి పాల్గొన్నారు.