కళ్యాణదుర్గం: శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయాన్ని అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు కుబేర యాదవ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కుబేర యాదవ్ శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి రూ. 50వేలు ఆర్థిక సహాయం అందజేశారు. యాదవ సంఘం నాయకులు, సభ్యులు కుబేర యాదవ్ ను శాలువతో సన్మానించారు. దేవాలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని యాదవ సంఘం సభ్యులకు సూచించారు.