

హోలీలో నృత్యం చేసిన తిరువూరు ఎమ్మెల్యే దంపతులు
ఏ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండాలో హోలీ పండుగ ఉత్సవంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దంపతులు శుక్రవారం హాజరు అయ్యారు. ఎమ్మెల్యే దంపతులకు సంప్రదాయ నృత్యంతో మహిళలు, చిన్నారులు స్వాగతం పలికారు. హోలీ పండుగ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న 35 తండాలకు ఒక్కొక్క తండాకు 10 వేల రూపాయలు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చిన్నట్లు తెలిపారు. మహిళలు చిన్నారులతో కలిసి సంప్రదాయ పాటలకు ఎమ్మెల్యే దంపతులు నృత్యం చేశారు.