
పెనుగొలను శివాలయంలో వైభవంగా రుద్ర హోమం
గంపలగూడెం మండలం పెనుగొలను శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా రుద్ర హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ, సత్యనారాయణ శర్మ ముందుగా రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.