నంద్యాల ఎంపీ శబరికి మరో ఆథిత్య ఆహ్వానం
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి మరో ఆథిత్య ఆహ్వానం అందింది. 79వ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో నవంబరు నెలలో 18-22 వరకు జరుగనున్నాయి. భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఎంపీకి అవకాశం కల్పించారు. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత దేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కలిపించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలుపుతున్నానని గురువారం తెలిపారు.