ఎచ్చెర్ల
ఎచ్చెర్ల: మీడియా కథనాలు సమాజహితాన్ని కోరేవిగా ఉండాలి
వాస్తవాలు, సమాజ ప్రయోజనాలు, విశ్వసనీయత వంటి అంశాలు మీడియా వార్తా రచనల్లో కనిపించాలని ఎచ్చెర్లలోని డా. బి. ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్- ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని శనివారం అభిప్రాయపడ్డారు. ఎంజేఎంసీ విభాగం నిర్వహించిన "జాతీయ పత్రికా దినోత్సవం' కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్శిటీలో జర్నలిజం అభ్యషన ద్వారా నేర్చుకున్న విజ్ఞానం, సమాజ హితాన్ని కోరుకునేదిగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.