

జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: వడగళ్ల వర్షానికి నేలకొరిగిన పంట
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లిలో మంగళవారం ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలువురి ఇళ్లు దెబ్బతిన్నాయి. గ్రామానికి చెందిన మహేశ్, యాదగిరి, ఆంజనేయులు, పవన్ రైతుల పొలాల్లో వడగళ్ల వర్షం కురవగా వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టం ఆవిరైందని రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.