ఫ్రైడే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆరోగ్య సిబ్బంది ఇంటి ఇంటికి తిరుగుతూ ఫ్రైడే డ్రై డే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాని ఆర్మూర్ సబ్ యునిట్ అధికారి సాయి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి నిల్వలు ఉన్నట్లయితే దోమలు వృద్ధి చెంది మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని, కాబట్టి ప్రజలందరూ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.