
ఆలూర్: ఎంపీడీవో కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆలూర్ మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయంను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ ఈ మండలం యొక్క పరిధిలోని గ్రామాల వారికి సేవలు అందిస్తామని తమ సేవల కొరకు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించగలరని సూచించారు. ఎంపీడీఓ ఆర్మూర్ సాయిరాం, ఆలూర్ గంగాధర్, ఎంపీవో శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ లక్ష్మి, ఆర్మూర్ డిఎంహెచ్వో రమేష్, తహసీల్దార్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.