
నిజామాబాద్: బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రయోగాలను ప్రదర్శించారు. అనంతరం కరస్పాండెంట్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ సైన్స్ పట్ల అవగాహనతో పాటు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.