బాన్సువాడ
బోర్లం గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామాన్ని శుక్రవారం ఎంపీడీవో బషీరుద్దీన్ సందర్శించారు. ఈ సందర్భంగా డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనం, ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. తదనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ నిలువ ఉన్న నీటిని పారబోయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.