ఖమ్మం
ఖమ్మం: వన్ టౌన్ కార్యదర్శిగా షేక్ నాగుల మీరా
సీపీఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శిగా షేక్ నాగుల మీరాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ వన్ టౌన్ మహాసభలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు సమక్షంలో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా నాగుల మీరా మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కోన్నారు.