ఖమ్మం
ఖమ్మం: నేడు నెట్ బాల్ ఎంపిక పోటీలు
ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్. ఫణికుమార్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీల్లో ఎంపిక చేయనున్నట్లు నవంబర్ 8నుంచి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంటాయని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటల కల్లా హాజరుకావాలని సూచించారు.