తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ డిపోలు మంజూరు: పొన్నం
తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 'దాదాపు ఆర్టీసీ వ్యవస్థలో 15 ఏళ్ళ తర్వాత 2 నూతత ఆర్టీసీ డిపోలను ఇస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతూ నూతన ఉద్యోగ నియమాకాలు, నూతన బస్సు కొనుగోళ్లు, కార్మికుల సంక్షేమంతో ముందుకెళుతున్న తరుణంలో జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి, ఏటూరు నాగారంలో 2 నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నాం' అని ప్రకటించారు.