వితంతు మహిళపై అత్యాచారం, న్యాయం చేయాలని బంధువుల ధర్నా (వీడియో)
తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి శనివారం రోజున అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అదే రోజున స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలి తరపు బంధువుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండ్రోజులు అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం బాధితురాలి బంధువులు ధర్నాకు దిగారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు.