బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో దారుణం జరిగింది. సెప్టెంబర్ 4 న జరిగిన షాకింగ్ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్ఎల్బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.