

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై కత్తిపోట్ల కలకలం
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం యువకుడిపై కత్తిపోట్లు కలకలం రేపాయి. హోలీ పండుగ సందర్భంగా చౌదరిగుడా, క్రికెట్ గ్రౌండ్ లో హోలీ కేల్ ఈవెంట్ లో ఉప్పు ఆదిత్య పాల్గొన్నాడు. ఈవెంట్ లో సౌండ్ సిస్టం దగ్గర కాలు తాకిందని చిన్న గొడవ జరిగింది. అక్కడి నుండి ఆదిత్య అతని నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వచ్చి నారపల్లి చౌరస్తా వద్ద నిలబడి ఉండగా అక్కడికి కొంతమంది దుండగులు బైక్‌లపై వచ్చి ఆదిత్యను చాకుతో పొడిచారు.